News March 19, 2024
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి ఊరట

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కి రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆయన లాంగ్ మార్చ్ నిర్వహించారు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఆయనను తాజాగా నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Similar News
News November 19, 2025
యువతకు ఉపాధిలో జిల్లా ముందంజ: జేసీ

యువతకు ఉపాధి కల్పించడంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముందంజలో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. మంగళవారం అమలాపురంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 36 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మొత్తం 267 మంది ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని జేసీ తెలిపారు.
News November 19, 2025
జైల్లో మొహియుద్దీన్‌పై దాడి!

టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
News November 19, 2025
లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్‌లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.


