News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739069128396_81-normal-WIFI.webp)
APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Similar News
News February 10, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్‌గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్‌గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్‌గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.
News February 10, 2025
ఇలాంటి మోసం చూడలేదయ్యా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739183986034_746-normal-WIFI.webp)
విమానాల్లో విండో సీట్‌కు డిమాండ్ ఎక్కువ. అయినప్పటికీ చాలామంది ఇష్టంతో ఎక్కువ డబ్బులైనా చెల్లించి విండో సీటు బుక్ చేసుకుంటుంటారు. అలానే బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి ఇండిగో ఎయిర్‌లైన్ షాక్ ఇచ్చింది. అసలు కిటికీనే లేని విండో సీటు ఇచ్చారంటూ అతను చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. అతడు తమిళ స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ కామెంటేటర్ కావడంతో ట్వీట్ ట్రెండ్ అవుతోంది.
News February 10, 2025
అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739189052303_695-normal-WIFI.webp)
క్రికెట్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్‌తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్ కోసం పాక్ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.