News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Similar News
News April 13, 2026
కలెక్టర్ సార్.. నెల్లూరులో వీటిపై ఓ కన్నేయండి!

నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్, ల్యాబ్ పరీక్షలు, అదనపు బెడ్స్ ఏర్పాటుకు అనుమతులు ఉండటం లేదు. అర్హత లేనివాళ్లు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు ఆసుపత్రి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఉదయగిరిలోని ఓ హాస్పిటల్లో 13 ఏళ్లుగా ఎలాంటి అనుమతలు లేకుండా వైద్యం అందించిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటిపై కలెక్టర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
News April 13, 2026
ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News April 13, 2026
ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.


