News February 9, 2025
లెబనాన్‌లో ఎట్టకేలకు పూర్తిస్థాయి సర్కారు

రెండేళ్ల నుంచి అట్టుడుకుతున్న లెబనాన్‌లో ఎట్టకేలకు శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో పూర్తిస్థాయి సర్కారు ఏర్పాటుకు దేశాధ్యక్షుడు జోసెఫ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రధాని నవాఫ్ సలామ్, తన 24మంది సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేస్తామని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు సలామ్ హామీ ఇచ్చారు.
Similar News
News July 5, 2025
మతపరమైన అంశాల్లో కలగజేసుకోం: భారత్

భారత ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ‘మత విశ్వాసాలపై ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోదు. భారత్‌లో మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంలో కలగజేసుకోవద్దని భారత్‌ను చైనా <<16940241>>హెచ్చరించిన <<>>విషయం తెలిసిందే.
News July 5, 2025
ఉత్కంఠ మ్యాచ్.. భారత్ ఓటమి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. ఓపెనర్లు సోఫియా 75, వ్యాట్ 66 రన్స్‌తో రాణించారు. ఛేదనలో భారత ఓపెనర్లు మంధాన 56, షఫాలీ 47 రన్స్ చేసి అద్భుత ఆరంభాన్నిచ్చినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5 రన్స్ తేడాతో ఓడిపోయింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 2 గేమ్స్ గెలిచిన టీమ్ ఇండియా 2-1తో లీడ్‌లో ఉంది.
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్లో 10,000వ డకౌట్‌గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్‌గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.