News February 9, 2025

లెబనాన్‌లో ఎట్టకేలకు పూర్తిస్థాయి సర్కారు

image

రెండేళ్ల నుంచి అట్టుడుకుతున్న లెబనాన్‌లో ఎట్టకేలకు శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో పూర్తిస్థాయి సర్కారు ఏర్పాటుకు దేశాధ్యక్షుడు జోసెఫ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రధాని నవాఫ్ సలామ్, తన 24మంది సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేస్తామని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు సలామ్ హామీ ఇచ్చారు.

Similar News

News April 10, 2026

RCB Vs RR.. టాస్ ఆలస్యం

image

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

News April 10, 2026

మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

image

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.

News April 10, 2026

ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

image

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.