News February 9, 2025

రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్

image

TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.

Similar News

News February 10, 2025

20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు

image

AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

News February 10, 2025

కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

image

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.

News February 10, 2025

రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్‌ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: Content is protected !!