News February 9, 2025

రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్

image

TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.

Similar News

News March 17, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

News March 17, 2025

కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స

image

AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News March 17, 2025

పాపం బామ్మ! రూ.20కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

image

ముంబైలో 86ఏళ్ల బామ్మ డిజిటల్ అరెస్టు బాధితురాలిగా మారారు. 2024 DEC 26 నుంచి MAR 3 వరకు ఏకంగా రూ.20.25 కోట్లు మోసపోయారు. ఆధార్, వ్యక్తిగత సమాచారంతో వేరెవరో బ్యాంకు A/C తెరిచి చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ఈ కేసులో కుమార్తెనూ అరెస్టు చేస్తామని బెదిరించారు. సాయపడాలని కోరడంతో డబ్బు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!