News February 9, 2025

వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌కు పోలీసుల నోటీసులు

image

AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల ఆఫీస్(జగన్ నివాసం కూడా అదే) వద్ద అగ్నిప్రమాదం జరగగా అక్కడి CC ఫుటేజీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తుకు ఫుటేజీ కీలకమని భావిస్తున్నారు. అటు అగ్ని ప్రమాదం నేపథ్యంలో జగన్ భద్రతపై YCP ఆందోళన వ్యక్తం చేయగా, వాళ్లే తగలబెట్టుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని TDP మండిపడింది.

Similar News

News March 13, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

image

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు

News March 13, 2026

ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.

News March 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.