News February 9, 2025

కాంగ్రెస్, BRS మధ్య ఒప్పందం: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Similar News

News March 12, 2025

పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

image

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్‌ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.

News March 12, 2025

ODI ర్యాంకింగ్స్: టాప్-3లో గిల్, రోహిత్

image

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ 3, కోహ్లీ 5, శ్రేయస్ పదో ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో కుల్దీప్ 3, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంలో నిలిచారు. ODI, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది.

News March 12, 2025

హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత

image

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉండగా గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ కొట్టేయడంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!