News February 9, 2025

కాంగ్రెస్, BRS మధ్య ఒప్పందం: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Similar News

News February 13, 2026

‘జైలర్-2’ రిలీజ్ డేట్ అదేనా?

image

రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటిస్తున్నారు. షారుఖ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.