News February 10, 2025

సర్పంచ్ పదవికి రూ.27 లక్షలు!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కొన్ని గ్రామాల్లో ఎలక్షన్ సందడి నెలకొంది. జోగులాంబ గద్వాల(D) గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా, భీమరాజు అనే వ్యక్తి రూ.27.60 లక్షలకు వేలంపాట పాడారు. ఈ డబ్బును శివాలయం నిర్మాణానికి ఖర్చు చేయాలని గ్రామస్థులు తీర్మానం చేశారు. అయితే భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండటంతో ఎలక్షన్ రూల్ ప్రకారం ఆయనకు ఈ పదవి దక్కుతుందో లేదో అనే చర్చ జరుగుతోంది.

Similar News

News March 25, 2026

జన్నారం: ఇద్దరు అటవీ అధికారులు సస్పెండ్

image

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్‌ఓ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎఫ్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అడవుల సంరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News March 25, 2026

టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్‌ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.

News March 25, 2026

SRHకు కావ్య, RCBకి అనన్య

image

IPLలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రత్యేక ఆకర్షణగా మారగా ఇప్పుడు ఆమెకు పోటీగా మరొకరు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా కన్సార్షియం రూ.16,725 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫ్రాంచైజీ ఛైర్మన్ ఆర్యమాన్ బిర్లా సోదరి అనన్య బిర్లా యాక్టివ్‌గా మారి, మ్యాచులు చూసేందుకు వస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.