News February 10, 2025
DyCM ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్.. స్పందించిన పవన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ స్పందించారు. ‘కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిన సానుభూతి, విషెస్, మీ మాటలు నాకు అపారమైన శక్తినిచ్చాయి’ అని పేర్కొన్నారు. కాగా, పవన్ కొన్ని రోజులుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Similar News
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.
News November 12, 2025
రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.
News November 12, 2025
‘ఫ్రీహోల్డ్’ రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడిగింపు

AP: ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఓ అంచనాకు రాలేకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు నిషేధాన్ని పొడిగించారు.


