News February 10, 2025

DyCM ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్.. స్పందించిన పవన్

image

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. దీనిపై పవన్ స్పందించారు. ‘కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాపై చూపిన సానుభూతి, విషెస్, మీ మాటలు నాకు అపారమైన శక్తినిచ్చాయి’ అని పేర్కొన్నారు. కాగా, పవన్ కొన్ని రోజులుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Similar News

News March 20, 2025

ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.

News March 20, 2025

నన్ను కలిసేందుకు డబ్బులు అవసరం లేదు: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో చిరును కలిసే అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చిరు Xలో స్పందించారు. ‘ఫ్యాన్ మీటింగ్‌ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను ఏమాత్రం ఒప్పుకోను. వారి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించనక్కర్లేదు’ అని ఫ్యాన్స్‌కు సూచించారు.

News March 20, 2025

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPL ఫ్యాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.

error: Content is protected !!