News February 10, 2025
రాత్రివేళ అమ్మాయిలనీ చూడకుండా.. ఇన్ఫోసిస్లో దారుణం!

మైసూర్లోని <<15388532>>ఇన్ఫోసిస్<<>> క్యాంపస్లో వేటుపడ్డ 400 ట్రైనీలతో మేనేజ్మెంట్ మానవత్వం మరిచి కర్కశంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. FEB 7న 6PMలోపు వెళ్లిపోవాలని ఆదేశించడంతో యువతులు ఇబ్బంది పడ్డారు. ‘ఈ ఒక్క రాత్రికి ఉండనివ్వండి. రేపు వెళ్లిపోతాను. ఈ రాత్రి ఎక్కడికని వెళ్లగలను’ అంటూ MP అమ్మాయి ఏడుస్తూ అడిగితే ‘అదంతా మాకు తెలియదు. మీరిప్పుడు ఉద్యోగి కాదు. వెళ్లిపోవాల్సిందే’ అని చెప్పినట్టు తెలిసింది.
Similar News
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<
News January 17, 2026
మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 17, 2026
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

స్కిన్ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి. విటమిన్-సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్, మొలకలు కూడా తీసుకోవాలి.


