News February 10, 2025

టర్మినేషన్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు బస్సుల్ని అడ్డంగా పెట్టిన ఇన్ఫీ: MC

image

ట్రైనీస్‌ను తొలగించేటప్పుడు <<15417347>>ఇన్ఫీ<<>> వ్యవహరించిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘ఆ రోజు క్యాంపస్‌లో Finacle ఎంప్లాయీస్, US క్లైంట్స్ ఉన్నారు. మమ్మల్ని టెర్మినేట్ చేయడం వాళ్లు చూడొద్దని బస్సులను అడ్డంగా పెట్టారు. ఆ వైపు వెళ్లకుండా షీల్డుగా ఎస్కార్టులను పెట్టారు. ఒక్కొక్కరినీ పిలిచి టెర్మినేట్ చేశారు. ఇది క్రూరత్వం. ట్రైనీస్ నిజం చెప్పేందుకు భయపడ్డారు’ అని ఒకరు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది.

Similar News

News October 24, 2025

మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

image

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News October 24, 2025

చైనా కుతంత్రం.. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్

image

భారత సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతోంది. టిబెట్‌లోని పాంగాంగ్ లేక్ వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు సాగుతున్నాయని India Today తెలిపింది. కమాండ్, కంట్రోల్ బిల్డింగ్స్, బారక్స్, వెహికల్స్ షెడ్స్ కడుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ క్షిపణులను మోసుకెళ్లే, ప్రయోగించే TEL వాహనాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. HQ-9 మిసైల్ వ్యవస్థలను దాచే అవకాశం ఉందంటున్నారు.

News October 24, 2025

వీరి మరణానికి బాధ్యులెవరు?

image

బస్సు <<18088805>>ప్రమాదాలకు<<>> ప్రధాన కారణం సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులను ‘మేనేజ్’ చేసి బస్సులు తిప్పుతాయనేది బహిరంగ రహస్యమే. తీరా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు ‘మళ్లీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం’ అని ఓ కామన్ డైలాగ్ చెప్పేస్తారు. మరి ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహించాలి? బస్సు యాజమాన్యమా? ప్రభుత్వమా? అధికారులా? అన్నీ తెలిసి బస్సెక్కే ప్రయాణికులా? COMMENT