News February 11, 2025

HYD: ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై కలెక్టర్‌ నిఘా

image

HYD కలెక్టరేట్‌లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఎవరు ఎప్పుడొస్తున్నారు? ఎంతసేపు పనిచేస్తున్నారు? అనే వివరాలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News January 14, 2026

HYD: ఎంట్రీ FREE.. కైట్ ఫెస్టివల్‌కు వెళ్దాం పద!

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.

News January 14, 2026

BJP ఎంపీలు, ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్!

image

మున్సిపల్ ఎన్నికల వేళ TBJP శ్రేణులకు అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చింది. మున్సిపల్ పోరు పార్టీ గుర్తుపై జరుగుతుందని, MPలు, MLAలు క్షేత్రస్థాయిలో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. GP జోష్‌తో ఇప్పుడు పట్టణ కోటలపై జెండా పాతాలని పక్కా ప్లాన్ వేసింది. ‘BRS, రాష్ట్ర సర్కార్ విఫలమైంది.. BJPకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రచార బరిలోకి దిగనుంది.

News January 14, 2026

HYD: సిటీలోని జైళ్లు కూడా డిజిటల్ మయం!

image

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.