News January 14, 2026
HYD: ఎంట్రీ FREE.. కైట్ ఫెస్టివల్‌కు వెళ్దాం పద!

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.