News March 20, 2024

ఆర్సీబీ జెర్సీపై విమర్శలు

image

ఆర్సీబీ జట్టు నిన్న తమ జెర్సీని రివీల్ చేసింది. నీలం, ఎరుపు రంగుల్లో ఉన్న ఆ జెర్సీ డిజైన్ పట్ల నెట్టింట చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ కూడా నీలం, ఎరుపు కాంబోలోనే జెర్సీలు తీసుకొచ్చాయని గుర్తుచేస్తున్నారు. గత ఏడాది జెర్సీ అద్భుతంగా ఉందని, దాన్నెందుకు మార్చారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో తెలపండి.

Similar News

News October 6, 2024

90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

News October 6, 2024

భారత్ టార్గెట్ 106 రన్స్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.

News October 6, 2024

కుమారులు సినిమాల్లోకి వస్తారా? జూ.ఎన్టీఆర్ సమాధానమిదే

image

తన కుమారులు అభయ్, భార్గవ్‌లను సినిమాల్లోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు జూ.ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన అభిప్రాయాలు, ఇష్టాలను వారిపై రుద్దడం నచ్చదన్నారు. వాళ్లిద్దరి ఆలోచనా తీరులో ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘మూవీల్లోకి రావాలి.. యాక్టింగ్‌లోనే రాణించాలని వాళ్లను ఫోర్స్ చేయను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను అలా ట్రీట్ చేయలేదు. పిల్లలకు వారి సొంత ఆలోచనలు ఉండాలనుకుంటా’ అని పేర్కొన్నారు.