News March 20, 2024
ఆర్సీబీ జెర్సీపై విమర్శలు
ఆర్సీబీ జట్టు నిన్న తమ జెర్సీని రివీల్ చేసింది. నీలం, ఎరుపు రంగుల్లో ఉన్న ఆ జెర్సీ డిజైన్ పట్ల నెట్టింట చాలామంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ కూడా నీలం, ఎరుపు కాంబోలోనే జెర్సీలు తీసుకొచ్చాయని గుర్తుచేస్తున్నారు. గత ఏడాది జెర్సీ అద్భుతంగా ఉందని, దాన్నెందుకు మార్చారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో తెలపండి.
Similar News
News September 15, 2024
‘మత్తు వదలరా-2’ చూసి చాలా ఎంజాయ్ చేశాం: మహేశ్ బాబు
మత్తు వదలరా-2 మూవీ యూనిట్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాం. సింహా, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వెన్నెల కిశోర్ స్క్రీన్‌పై కనిపించగానే నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్యను చూస్తున్నంతసేపూ మేమంతా నవ్వుతూనే ఉన్నాం. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2024
Learning English: Synonyms
✒ Amazing: Incredible, Unbelievable
✒ Anger: Enrage, Infuriate, Arouse
✒ Angry: Wrathful, Furious, Enraged
✒ Answer: Reply, Respond, Retort
✒ Ask: Question, Inquire, Query
✒ Awful: Dreadful, Terrible, Abominable
✒ Bad: Depraved, Rotten, Sinful
✒ Beautiful: Gorgeous, Dazzling, Splendid
✒ Begin: Start, Open, Launch, Initiate
News September 15, 2024
రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
FY2022-23లో ₹1.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత జరగగా, FY2023-24లో ఆ మొత్తం ₹2.01 లక్షల కోట్లుగా నమోదైనట్లు DGGI వెల్లడించింది. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో అత్యధికంగా ₹81,875cr ఎగవేత జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(₹18,961cr), ఖనిజాలు(₹16,806cr), పొగాకు, సిగరెట్ ఉత్పత్తులు(₹5,794cr), కాంట్రాక్టు సర్వీసెస్(₹3,846cr) రంగాలు ఉన్నాయని పేర్కొంది.