News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
News January 26, 2026
రేపు అఖిలపక్ష భేటీ

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.
News January 26, 2026
5 సెకన్లలో 10 బుల్లెట్లు.. USను కుదిపేస్తున్న అలెక్స్ మరణం!

USలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టీ అనే వ్యక్తి మరణించడం దుమారం రేపుతోంది. ఇమిగ్రేషన్ అధికారుల దౌర్జన్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నందుకే అతడిపై 5 సెకన్లలో 10 బుల్లెట్లు పేల్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. అతడి వద్ద గన్ ఉందని అధికారులు వాదిస్తున్నా వీడియోల్లో మాత్రం ఫోన్ మాత్రమే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్ హయాంలోని ఏజెంట్ల దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.


