News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2025
హైకోర్టుల్లో 62 లక్షల పెండింగ్ కేసులు!

వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారిపై కోర్టులో విచారణ పూర్తిచేసేందుకు ఏళ్లు పడుతోంది. ఇందుకు కారణం న్యాయమూర్తుల కొరతేనని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడైంది. 2024 చివరి నాటికి సుప్రీంకోర్టులో 82,000, వివిధ హైకోర్టులలో 62 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 25 హైకోర్టుల్లో 1,122 మంది న్యాయమూర్తులను మంజూరు చేస్తే ప్రస్తుతం 750 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.
News March 28, 2025
టెన్త్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనం

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.
News March 28, 2025
ALERT.. వాకింగ్‌లో ఇలా చేయకండి

ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్(నడక) చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని తప్పులు చేస్తే గుండెపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ కింది తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు.
* మరీ వేగంగా నడవడం
* వార్మప్ చేయకపోవడం
* వంగి నడవడం
* వాకింగ్ ముందు/తర్వాత నీరు తాగకపోవడం
* అమితంగా తినడం
* కాలుష్య ప్రాంతాల్లో నడవడం
* అతిగా శ్రమించడం