News February 12, 2025

బర్డ్ ఫ్లూపై మంత్రి ఆదేశాలు

image

AP: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 12, 2025

భారత్ భారీ స్కోర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. గిల్ సెంచరీ(112)తో అదరగొట్టగా శ్రేయస్ 78, కోహ్లీ 52, రాహుల్ 40 రన్స్‌తో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ ఈసారి ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.

News February 12, 2025

గాజా పాలస్తీనీయులదే.. ఖాళీ చేయకూడదు: చైనా

image

గాజా నుంచి పాలస్తీనీయుల్ని ఖాళీ చేయించి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని చైనా ఖండించింది. ‘గాజా అనేది పాలస్తీనీయులకు మాత్రమే చెందినది. అది వారి భూభాగం. అక్కడి నుంచి పాలస్తీనీయుల్ని బలవంతంగా ఖాళీ చేయించే ఆలోచనను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొంది. అటు అరబ్ లీగ్ కూడా అమెరికా ఆలోచనను తప్పుబట్టింది. అరబ్ ప్రపంచం దాన్ని ఆమోదించబోదని తేల్చిచెప్పింది.

News February 12, 2025

‘కింగ్డమ్’ టీజర్‌పై రష్మిక స్పెషల్ పోస్ట్

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. దీనిపై VD ఫ్రెండ్, హీరోయిన్ రష్మిక మందన్న స్పందిస్తూ ఇన్‌స్టాలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ఇతడు ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తాడు. విజయ్ నిన్ను చూసి నేను గర్విస్తున్నా’ అని రష్మిక పేర్కొన్నారు. విజయ్ కొత్త సినిమా టీజర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.

error: Content is protected !!