News February 12, 2025
బర్డ్ ఫ్లూపై మంత్రి ఆదేశాలు

AP: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
News March 22, 2025
ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
News March 22, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ

AP: విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని కలెక్టర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయంటూ పర్యాటకులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఆ హోదాను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్‌లో సౌకర్యాలను కల్పించింది.