News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

Similar News

News February 12, 2025

యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ వచ్చింది: పరిణీత తండ్రి

image

మధ్యప్రదేశ్‌కు చెందిన పరిణీత సంగీత్ వేడుకలో డాన్స్ చేస్తూ <<15414198>>గుండెపోటుతో<<>> చనిపోయిన ఘటనపై ఆమె తండ్రి సురేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వారం క్రితమే పరిణీత అన్ని టెస్టులు చేయించుకోగా నార్మల్ అని వచ్చింది. ఆమె చనిపోతుందనే ముందస్తు హెచ్చరిక, సంకేతం ఏదీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది. రోజూ యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉండేది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News February 12, 2025

భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

image

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. ఇవాళ జరిగిన చివరి వన్డేలో ఇండియా 142 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 357 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 214 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్, బ్యాంటన్ చెరో 38 రన్స్‌తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. IND బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, అక్షర్ తలో 2, సుందర్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు గిల్ <<15440761>>సెంచరీతో<<>> రాణించారు.

News February 12, 2025

కర్ణాటకలో తొలి కారుణ్య మరణం ఈవిడదే!

image

ఎప్పటికీ నయమవ్వని వ్యాధులతో బాధపడుతోన్న వారికి <<15326754>>కారుణ్య మరణం<<>> పొందే హక్కు కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో తొలి మరణం 85 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కరిబసమ్మది కానుంది. ఆమె మూడు దశాబ్దాలకు పైగా స్లిప్డ్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. క్యాన్సర్‌ బారిన కూడా పడి నరకం అనుభవిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో గౌరవంగా మరణించే హక్కును ఈమె పొందారు.

error: Content is protected !!