News February 12, 2025

INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన

image

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.

Similar News

News February 12, 2025

కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన

image

TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.

News February 12, 2025

ముస్లిం ప్రభుత్వోద్యోగులకు ఏపీ GOVT గుడ్ న్యూస్

image

AP: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలకు రాష్ట్ర సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో విధుల నుంచి వారు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 2 నుంచి 30 వరకు ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే విధుల నుంచి వెళ్లొచ్చని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అదే విధంగా ముస్లింలందరికీ రంజాన్ తోఫాను అందించాలని CM నిర్ణయించారు.

News February 12, 2025

హీరో విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు?

image

తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పీకేను తమ సలహాదారుగా విజయ్ నియమించుకోవాలని భావిస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

error: Content is protected !!