News February 12, 2025
INDvsENG మ్యాచ్: అవయవదానానికి భారీ స్పందన

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే, పరుగులతో పాటు అవయవాలు దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మ్యాచుకు ముందు అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని ఇరు జట్ల ప్లేయర్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి భారీ స్పందన లభించింది. ఇప్పటివరకు 15,754 మంది ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News March 24, 2025
ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్

APలో తమిళ మీడియం పాఠశాలలు ఉండటం సంతోషమని BJP నేత తమిళి సై చేసిన ట్వీట్‌కు DyCM పవన్ స్పందించారు. ‘చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. AP భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది. తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో 1,610 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 24, 2025
రాహుల్ గాంధీతో డేట్ చేయాలనుకున్నా: బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కాంట్రవర్సీకి దారి తీయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తరచుగా RG ఫొటోలను చూసేదాన్నని పేర్కొన్నారు. తమ కుటుంబాల బ్యాగ్రౌండ్ అందరికీ తెలిసిందేనని చెప్పారు. కాగా 2012లో సైఫ్‌ను కరీనా పెళ్లి చేసుకున్నారు.