News February 12, 2025

కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన

image

TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

News February 13, 2025

కోహ్లీ ఏ జట్టుపై ఎన్ని రన్స్ చేశారంటే?

image

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆస్ట్రేలియాపై 5393 పరుగులు (ఆల్ ఫార్మాట్స్) చేశారు. ఆ తర్వాత శ్రీలంక (4076), ఇంగ్లండ్ (4038), వెస్టిండీస్ (3850), సౌతాఫ్రికా (3306), న్యూజిలాండ్ (2915), బంగ్లాదేశ్ (1676), పాకిస్థాన్ (1170), ఆఫ్గానిస్థాన్ (347), జింబాబ్వే (305), నెదర్లాండ్స్ (125), ఐర్లాండ్ (88), హాంగ్ కాంగ్ (59), యూఏఈ (33), స్కాట్లాండ్‌పై 2 రన్స్ చేశారు.

News February 13, 2025

17న మహాకుంభ మేళాకు లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలిసి ఈ నెల 17న ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. అక్కడ వారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదే రోజు సాయంత్రం లోకేశ్ దంపతులు వారణాసి చేరుకొని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది.

error: Content is protected !!