News February 12, 2025
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన

TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 15, 2025
ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.
News March 15, 2025
జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

AP: వైసీపీ రాక్షస మూకల దాడిలో మృతిచెందిన చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హత్యా రాజకీయాలు మానడం లేదని మండిపడ్డారు. YCP రక్తచరిత్రకు TDP సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
News March 15, 2025
రోజూ సాయంత్రం వీటిని తింటున్నారా?

చాలామందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. అలా అని ఏదిపడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెనంపై వేయించిన శనగలు తింటే పోషకాలు అందుతాయి. ఉడకపెట్టిన మొక్కజొన్న తింటే ఫైబర్ లభిస్తుంది. బాదం పప్పు, నల్లద్రాక్ష, పిస్తా, వాల్‌నట్స్, పండ్లు వంటివి తింటే ప్రొటీన్లు లభిస్తాయి. నూనెలో ముంచి తీసిన బజ్జీలు, పునుగులు, పకోడీ వంటివి తింటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు.