News February 13, 2025
ఆసియాలో రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరిదంటే?

ఆసియాలోనే టాప్-20 అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారత్‌కు చెందినవేనని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ₹7.86L Cr సంపదతో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. 4,7,9,13,18 స్థానాల్లో వరుసగా మిస్త్రీ(₹3.25L Cr), జిందాల్(₹2.44L Cr), బిర్లా(₹1.99L Cr), బజాజ్(₹1.74L Cr), హిందూజా(₹1.32L Cr) కుటుంబాలు ఉన్నాయి. 2,3, స్థానాల్లో చీరావనోండ్-థాయ్‌లాండ్(₹3.70L Cr), హర్టోనో-ఇండోనేషియా(₹3.66L Cr) నిలిచాయి.
Similar News
News March 12, 2025
పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.
News March 12, 2025
ODI ర్యాంకింగ్స్: టాప్-3లో గిల్, రోహిత్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ 3, కోహ్లీ 5, శ్రేయస్ పదో ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో కుల్దీప్ 3, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంలో నిలిచారు. ODI, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది.
News March 12, 2025
హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉండగా గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ కొట్టేయడంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.