News March 20, 2024

అతడి కోసం తూటాకైనా అడ్డునిలబడతా: గంభీర్

image

నెదర్లాండ్స్ ఆటగాడు ర్యాన్ టెన్ డొషేటేపై KKR మెంటార్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘నా కెరీర్‌ మొత్తంలో నేను చూసిన అత్యంత నిస్వార్థమైన ఆటగాడు ర్యాన్‌ టెన్ డొషేటేనే. 2011లో కేకేఆర్ కెప్టెన్‌గా నా తొలి గేమ్‌లో తనను పక్కన పెట్టాను. అయినా సరే ఏమాత్రం భేషజం లేకుండా నవ్వుతూ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించాడు. నిస్వార్థాన్ని తనే నాకు నేర్పాడు. అతడి కోసం నేను తూటాకైనా అడ్డు నిలబడతాను’ అని వెల్లడించారు.

Similar News

News November 25, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఏడుపు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు.

News November 25, 2024

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంటులో చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

News November 25, 2024

ప్రపంచంలో భూమికి అత్యంత దూరమైన ప్రదేశం ఇదే

image

న్యూజిలాండ్‌కి, చిలీకి మధ్య ఉన్న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాయింట్ నీమో అనే ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యంత ఒంటరితనంగా ఉండే ప్రాంతంగా పరిశోధకులు చెబుతుంటారు. 1992లో దీన్ని గుర్తించారు. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో భూమి కనిపించదు. దగ్గర్లోని భూమి 2688 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్‌గా చెప్పాలంటే భూమి కంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే నీమో పాయింట్‌కు దగ్గరగా(400 కి.మీ) ఉంటుంది.