News February 14, 2025
మస్క్‌తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.
Similar News
News October 19, 2025
ముందు నీ దేశాన్ని బాగుచేసుకో ట్రంప్!

US అధ్యక్షుడు ట్రంప్ పాలసీలు, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ లక్షలాది మంది వీధుల్లోకెక్కారు. ఆ <<18047118>>నిరసనల<<>> వీడియోలు వైరల్ కాగా ట్రంప్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపాను. నా వల్లే ఇతర దేశాల్లో శాంతి నెలకొందని గొప్పలు చెప్పుకోవడం కాదు. మంచి పాలన అందించి ముందు నీ దేశాన్ని బాగుచేసుకో’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. అసలు ట్రంప్‌ను ఎందుకు ఎన్నుకున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
News October 19, 2025
సోయాచిక్కుడులో కాయకుళ్లు.. నివారణ ఇలా

ప్రస్తుతం సోయాచిక్కుడు గింజ గట్టిపడే దశలో ఉంది. అయితే వర్షాల కారణంగా ఆంత్రాక్నోస్ కాయకుళ్లు, మసిబొగ్గు తెగుళ్లు ఎక్కువగా పంటకు వ్యాపిస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణకు ముందస్తు చర్యగా 2.5గ్రా. టెబ్యుకొనజోల్ 10శాతం+ సల్ఫర్ 65 శాతం WG లేదా 0.6 మి.లీ పైరాక్లోస్ట్రోబిన్+ప్లక్సాపైరోక్సాడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2.0గ్రా. మేథిరం+ పైరాక్లోస్ట్రోబిన్ కూడా వాడొచ్చు.
News October 19, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో 1426 పోస్టులు!

టెరిటోరియల్ ఆర్మీ 1426 సోల్జర్ పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ర్యాలీ చేపట్టనుంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, PFT, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.ncs.gov.in/