News February 14, 2025
భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
రాత్రిపూట లైట్ ఆన్ చేసుకునే నిద్రపోతున్నారా?

చాలామందికి రాత్రి లైట్ ఆన్ చేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారికి అనారోగ్య ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీకటిలో నిద్రపోయే వారి కంటే వెలుగులో నిద్రపోయేవారికి ఊబకాయం ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే చిరాకు, మానసిక కల్లోలం, డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహం రావచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులూ వచ్చే అవకాశం ఉంది.
News February 21, 2025
14 ఏళ్లకే ఆరు ప్రపంచ రికార్డులు!

మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ శుక్లా కాలిక్యులేటర్ కంటే వేగంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఇతడు 6 ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. వంద 4-అంకెల సంఖ్యలను కేవలం 30.9 సెకన్లలో, రెండు వందల 4 అంకెల సంఖ్యలను 1.9 నిమిషాల్లో, యాబై 5 అంకెల సంఖ్యలను 18.71 సెకండ్లలో యాడ్ చేశాడు. వీటితో పాటు డివిజన్, మల్టిప్లికేషన్స్‌లో మరో మూడు రికార్డులు సృష్టించాడు.
News February 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.