News February 14, 2025
భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
News March 28, 2025
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.
News March 28, 2025
ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి: పుతిన్

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.