News February 14, 2025

Good News: వీరి జీతాలు 40% పెరగొచ్చు!

image

2025లో వార్షిక వేతనాలు 6-15% వరకు పెరగొచ్చని మైకేల్ పేజ్ 2025 శాలరీ గైడ్ అంచనా వేసింది. ఉద్యోగంలో సంక్లిష్టత, నాయకత్వ బాధ్యతలను బట్టి AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ రంగాల్లో శాలరీలు గరిష్ఠంగా 40% వరకు పెరుగుతాయని పేర్కొంది. డిమాండును బట్టి అకౌంటింగ్‌లో ₹22L, మార్కెటింగ్ మేనేజర్‌కు ₹35L, సాఫ్ట్‌వేర్ డెవలపింగ్‌లో ₹50L వరకు సగటు వేతనాలు ఉంటాయని అంచనా వేసింది. మిగిలిన రంగాల్లో తక్కువేనంది.

Similar News

News January 31, 2026

Budget: హిస్టరీ క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

image

రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అవి వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి.

News January 31, 2026

నేడు శని త్రయోదశి.. సాయంత్రం ఇలా చేయండి!

image

శనైశ్చరుడు విష్ణు భక్తుడు కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితుల మాట. ‘సా.5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోండి’ అని చెబుతున్నారు.

News January 31, 2026

కోళ్లలో ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు

image

కోళ్ల పెంపకంలో అతి ప్రధాన సమస్య వ్యాధులు రావడం. వీటిని సకాలంలో గుర్తించి, నివారించకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోళ్లలో అతి ప్రమాదకరమైనది కొక్కెర వ్యాధి. దీంతోపాటు కొరైజా, అమ్మోరు/మశూచి, పుల్లొరం, తెల్లపారుడు వ్యాధులు పెంపకందారులకు, ఫౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని కోళ్లలో ఎలా గుర్తించాలి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.