News February 14, 2025
Good News: వీరి జీతాలు 40% పెరగొచ్చు!

2025లో వార్షిక వేతనాలు 6-15% వరకు పెరగొచ్చని మైకేల్ పేజ్ 2025 శాలరీ గైడ్ అంచనా వేసింది. ఉద్యోగంలో సంక్లిష్టత, నాయకత్వ బాధ్యతలను బట్టి AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ రంగాల్లో శాలరీలు గరిష్ఠంగా 40% వరకు పెరుగుతాయని పేర్కొంది. డిమాండును బట్టి అకౌంటింగ్‌లో ₹22L, మార్కెటింగ్ మేనేజర్‌కు ₹35L, సాఫ్ట్‌వేర్ డెవలపింగ్‌లో ₹50L వరకు సగటు వేతనాలు ఉంటాయని అంచనా వేసింది. మిగిలిన రంగాల్లో తక్కువేనంది.
Similar News
News March 22, 2025
నీటి ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. 28 రోజుల కింద టన్నెల్‌లో 8 మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహాన్ని ఇటీవల వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.
News March 22, 2025
IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.