News February 14, 2025
దొంగతనం చేసి ఆలయానికి విరాళం

రాజస్థాన్ అజ్మీర్‌లోని ముగ్గురు దొంగలు దేశవ్యాప్తంగా వైరలైపోయారు. వీరు ఓ షాపింగ్ మాల్‌లో దొంగతనానికి వెళ్లే ముందు అంతా సజావుగా సాగితే ఆలయానికి విరాళం ఇస్తామని దేవుడికి మొక్కుకున్నారు. రూ.15 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత ఆలయానికి రూ.లక్ష విరాళం ఇచ్చి అన్నదానం నిర్వహించారు. 200 CCTV ఫుటేజ్‌లు పరిశీలించి 900KMS ప్రయాణించి దొంగలను పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయం తెలిసింది.
Similar News
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <