News February 14, 2025

దొంగతనం చేసి ఆలయానికి విరాళం

image

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని ముగ్గురు దొంగలు దేశవ్యాప్తంగా వైరలైపోయారు. వీరు ఓ షాపింగ్ మాల్‌లో దొంగతనానికి వెళ్లే ముందు అంతా సజావుగా సాగితే ఆలయానికి విరాళం ఇస్తామని దేవుడికి మొక్కుకున్నారు. రూ.15 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత ఆలయానికి రూ.లక్ష విరాళం ఇచ్చి అన్నదానం నిర్వహించారు. 200 CCTV ఫుటేజ్‌లు పరిశీలించి 900KMS ప్రయాణించి దొంగలను పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయం తెలిసింది.

Similar News

News July 8, 2025

చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

image

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News July 8, 2025

ఎల్లుండి నుంచి 16 బోగీలతో కాచిగూడ వందేభారత్

image

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 ఛైర్‌కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 బోగీలు ఉండగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14CC, 2 EC కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. కాగా బుధవారం మినహా ప్రతిరోజూ ఈ రైలు ఉ.5.45కు కాచిగూడలో బయల్దేరి మ.2 గంటలకు యశ్వంత్‌పూర్, అలాగే మ.2.45కు అక్కడ బయల్దేరి రా.11 గంటలకు కాచిగూడ చేరుతుంది.

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.