News February 15, 2025
GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News March 12, 2025
ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ!

ఓ వైపు 40+ డిగ్రీల ఎండ. ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. కానీ, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నారీ నిరుద్యోగులు. ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.
News March 12, 2025
పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.
News March 12, 2025
ODI ర్యాంకింగ్స్: టాప్-3లో గిల్, రోహిత్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ 3, కోహ్లీ 5, శ్రేయస్ పదో ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో కుల్దీప్ 3, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంలో నిలిచారు. ODI, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది.