News February 15, 2025

GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

image

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News March 23, 2025

వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

image

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.

News March 23, 2025

ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

image

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.

News March 23, 2025

పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

image

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్‌ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.

error: Content is protected !!