News February 15, 2025

సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

image

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.

Similar News

News January 2, 2026

రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

image

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.

News January 2, 2026

గొంతునొప్పి తగ్గాలంటే..

image

ఎవరైనా శీతాకాలంలో ఎక్కువ ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటారు. జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి కామన్‌గా వస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే వీటికి చెక్ పెట్టొచ్చు.
☛గొంతునొప్పి వస్తే గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే రిలీఫ్‌గా ఉంటుంది. ☛గొంతునొప్పి ఉన్నప్పుడు మిరియాల పాలు తాగినా అద్భుతంగా పనిచేస్తుంది. గొంతులోని ఇన్ఫెక్షన్ పోతుంది.

News January 2, 2026

భారీ జీతంతో TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

TRAIలో 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి JAN 4 ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ (ECE, CS&IT, డేటా సైన్స్& AI) ఉత్తీర్ణతతో పాటు GATE- 2023, 2024, 2025లో అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. బేసిక్ పే రూ.56,100. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.trai.gov.in/