News February 15, 2025
సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.
Similar News
News April 20, 2026
పద్మశ్రీ కోసం బతిమాలను: బాబు మోహన్

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ పద్మశ్రీ పురస్కారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ కోసం ఎవరినీ వేడుకోలేదని, బతిమాలుకోవడం తనకు అలవాటు లేదన్నారు. రేలంగి పురస్కారం అందుకున్న సందర్భంగా పద్మశ్రీ రాకపోవడంపై ఎదురైన ఓ ప్రశ్నకు స్పందిస్తూ ఇలా బదులు ఇచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల బాబుమోహన్ సినీఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
News April 20, 2026
పరమాత్ముడు ఒక్కటే.. మతాలన్నీ ప్రజల కల్పనలే!

మర్మమెరుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: పరమాత్ముడి అసలు రహస్యం తెలియక మూఢ జనాలు విభిన్న మతాలను కల్పించారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ బాధపడుతూ కాలం గడుపుతున్నారు. అద్దాల గదిలో ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని చూస్తే కలవరపడి మొరుగుతుందో అలా చేస్తున్నారు.
<<-se>>#PADHYAM<<>>
News April 20, 2026
డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.


