News February 15, 2025

అప్పట్లో..! టీచర్ అంటే సర్ కాదు!!

image

స్కూల్ డేస్‌లో టీచర్, సర్ తేడాలు గుర్తున్నాయా. అప్పట్లో టీచర్ అంటే ఉపాధ్యాయురాలు. సర్ అంటే ఉపాధ్యాయుడు. పొరపాటున ఎవరైనా సర్‌ని టీచర్ అంటే ఆయన టీచర్ కాదు సర్ అని చెప్పి అంతా నవ్వడం, ఆ తర్వాత ఏడిపించడం సాధారణంగా జరిగేవి. ఇప్పుడు కొంచెం జెండర్ డిఫరెన్స్ క్లారిటీ వచ్చేలా మేడమ్, సర్ అంటున్నారు.
Ex: మీకు ఇంగ్లిష్ సబ్జెక్ట్ మేడమ్ చెబుతారా? సర్ చెబుతారా?
మీకూ ఈ టీచర్, సర్ అనుభవం ఉందా? కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2025

దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా..

image

2025, జనవరి 31 నాటికి దేశంలో 28లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపింది. అందులో 65% అంటే 18.1లక్షల కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నాయంది. ఇక 5,216 ఫారిన్ కంపెనీలు నమోదవ్వగా అందులో 63% (3,281) యాక్టివ్‌గా ఉన్నట్టు పేర్కొంది. మొత్తంగా 9,49,934 కంపెనీలు మూతపడ్డాయని వెల్లడించింది. బిజినెస్ సర్వీసెస్‌లో 27%, తయారీలో 20%, ట్రేడింగ్‌లో 13% కంపెనీలు పనిచేస్తున్నాయి.

News February 19, 2025

హైదరాబాద్‌లో ఏపీ గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన

image

TG: ఏపీ గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు సరిచేయాలంటూ ఆ రాష్ట్ర అభ్యర్థులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తప్పులు సరిచేసి మరోసారి పరీక్షలు నిర్వహించాలంటూ నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో వారు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరీక్షల్లో తప్పులపై ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

News February 19, 2025

నం.1 ర్యాంకులో గిల్

image

వన్డేల్లో భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ నం.1 ర్యాంకుకు చేరారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఈ బ్యాటర్ 796 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. పాక్ ప్లేయర్ బాబర్ (773P), రోహిత్ శర్మ (761P) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో ENG ప్లేయర్ రూట్, టీ20ల్లో ఆసీస్ బ్యాటర్ హెడ్ మొదటి స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో AUS, వన్డేలు, టీ20ల్లో భారత్ తొలి స్థానంలో ఉన్నాయి.

error: Content is protected !!