News February 15, 2025
అప్పట్లో..! టీచర్ అంటే సర్ కాదు!!

స్కూల్ డేస్‌లో టీచర్, సర్ తేడాలు గుర్తున్నాయా. అప్పట్లో టీచర్ అంటే ఉపాధ్యాయురాలు. సర్ అంటే ఉపాధ్యాయుడు. పొరపాటున ఎవరైనా సర్‌ని టీచర్ అంటే ఆయన టీచర్ కాదు సర్ అని చెప్పి అంతా నవ్వడం, ఆ తర్వాత ఏడిపించడం సాధారణంగా జరిగేవి. ఇప్పుడు కొంచెం జెండర్ డిఫరెన్స్ క్లారిటీ వచ్చేలా మేడమ్, సర్ అంటున్నారు.
Ex: మీకు ఇంగ్లిష్ సబ్జెక్ట్ మేడమ్ చెబుతారా? సర్ చెబుతారా?
మీకూ ఈ టీచర్, సర్ అనుభవం ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News April 19, 2026
21న కృష్ణా జిల్లా తైక్వాండో జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్ 17 కాడెట్, సీనియర్ పురుషుల, మహిళలు తైక్వాండో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షులు బస్సే నాగ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలన్నారు.
News April 19, 2026
అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.