News February 15, 2025

UPS అమలుకు కేంద్రం ఆమోదం

image

APR 1 నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం(UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్‌లో 60% ఫ్యామిలీకి పెన్షన్‌గా ఇస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు. తక్కువ టైం పనిచేస్తే తదనుగుణంగా పెన్షన్ ఇస్తారు.

Similar News

News November 13, 2025

మూడేళ్లు జైల్లో గడిపిన అల్‌-ఫలాహ్ ఫౌండర్!

image

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.

News November 13, 2025

క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

image

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.

News November 13, 2025

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ గురించి తెలుసా?

image

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ ఉన్నవారిలో పాలపదార్థాల్లో ఉండే లాక్టోజ్​ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వస్తాయి. వీరు రాగులను నానబెట్టి రుబ్బి తీసిన పాలు, రాగిజావ, రాగి మాల్ట్‌, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్ ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.