News February 15, 2025
UPS అమలుకు కేంద్రం ఆమోదం

APR 1 నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం(UPS) అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. NPS కింద UPSను ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక చేసుకోవచ్చు. దీని కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్‌లో 60% ఫ్యామిలీకి పెన్షన్‌గా ఇస్తారు. రిటైర్డ్ టైంలో గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు ఉంటాయి. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారికి చివరి ఏడాది బేసిక్ పే సగటులో 50% పెన్షన్ ఇస్తారు. తక్కువ టైం పనిచేస్తే తదనుగుణంగా పెన్షన్ ఇస్తారు.
Similar News
News March 17, 2025
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 17, 2025
రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: KTR

TG: ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ ఒప్పుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో అంతా బానే ఉందని కాంగ్రెస్ నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడులు, వ్యవసాయ రంగ వృద్ధి, సంపద, సీఎం పనితీరు మెరుగ్గా ఉందని చెబుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు, విధానాల ఫలితమే ఈ ప్రతికూల వృద్ధి అని పేర్కొన్నారు.
News March 17, 2025
ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్, సుయాశ్.