News February 16, 2025
నేటి ముఖ్యాంశాలు

* 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్
* ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం: భట్టి
* BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
* మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
* టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: మంత్రి లోకేశ్
* జీబీఎస్ కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్
Similar News
News February 21, 2025
ఎల్లుండి యాదగిరిగుట్టకు సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో, అర్చకులు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు.
News February 21, 2025
బెంగళూరును మార్చడం దేవుడి వల్ల కూడా కాదు: Dy CM

తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి, అధిక అద్దె ధరల వంటి సమస్యలతో బెంగళూరు సతమతమవుతోంది. అయితే తమకు అధికారం ఉన్న కొన్నేళ్లలోనే బెంగళూరును బాగు చేయడం అసాధ్యమని ఆ రాష్ట్ర Dy CM డీకే శివకుమార్ అన్నారు. ‘మూడేళ్లలో ఈ నగరాన్ని మార్చడం దేవుడి వల్ల కూడా కాదు. సరైన ప్రణాళిక రచించి, దాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే అది సాధ్యం. ప్రస్తుతానికి రోడ్ల నిర్వహణపై హ్యాండ్ బుక్ విడుదల చేశాం’ అని తెలిపారు.
News February 21, 2025
నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.