News February 21, 2025

ఎల్లుండి యాదగిరిగుట్టకు సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎంను కలిసి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో, అర్చకులు సీఎంకు ఆహ్వానపత్రిక అందించారు.

Similar News

News March 25, 2025

50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

image

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.

News March 25, 2025

రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

image

AP: రేపు రాష్ట్రంలోని <>108 మండలాల్లో<<>> వడగాలుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇవాళ నంద్యాల (D) రుద్రవరంలో 41.6°C, ప్రకాశం (D) దరిమడుగులో 41.1°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. 15 మండలాల్లో వడగాలులు వీచాయంది. మరోవైపు అకాల వర్షం వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద నిలబడొద్దని చెప్పింది.

News March 25, 2025

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

image

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.

error: Content is protected !!