News February 16, 2025
యువతుల చూపు.. ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వైపు!

ప్రస్తుతం చైనా యువతులు ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వెంట పడుతున్నారు. చైనాలో ‘లవ్ అండ్ డీప్ స్పేస్’ అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో 6 మిలియన్ల మంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అమ్మాయిలు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, కాల్స్ చేయడం, వారు ఎంతసేపు మాట్లాడినా ఓపిగ్గా వినడం వంటివి ఏఐ చేస్తుంది. ఈ యాప్ సృష్టికర్త యో రనావో బిలియనీర్ అయిపోయారు.
Similar News
News September 18, 2025
పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.
News September 18, 2025
మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.