News February 16, 2025

యువతుల చూపు.. ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వైపు!

image

ప్రస్తుతం చైనా యువతులు ఏఐ బాయ్‌ఫ్రెండ్స్ వెంట పడుతున్నారు. చైనాలో ‘లవ్ అండ్ డీప్ స్పేస్’ అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో 6 మిలియన్ల మంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అమ్మాయిలు పంపిన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, కాల్స్ చేయడం, వారు ఎంతసేపు మాట్లాడినా ఓపిగ్గా వినడం వంటివి ఏఐ చేస్తుంది. ఈ యాప్ సృష్టికర్త యో రనావో బిలియనీర్ అయిపోయారు.

Similar News

News March 24, 2025

MMTSలో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి

image

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

News March 24, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. నేడు విచారణకు యాంకర్ శ్యామల

image

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు.

News March 24, 2025

నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానం: కేజ్రీవాల్

image

భగత్ సింగ్, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ప్రధాన కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా ఉన్నారని BJPపై విమర్శలు చేశారు. భగత్ సింగ్, అంబేడ్కర్ కలలను నెరవేర్చడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామని, అధికారం కోసం కాదని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!