News February 16, 2025

18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.

Similar News

News January 17, 2026

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

News January 17, 2026

స్త్రీ ద్వేషులకు ప్రజలు బుద్ధి చెప్పారు: కంగనా

image

BMC <<18877157>>ఎన్నికల్లో<<>> మహాయుతి కూటమి గెలుపుపై నటి, MP కంగనా సంతోషం వ్యక్తం చేశారు. శివసేన(ఉద్ధవ్ వర్గం)కి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ‘స్త్రీ ద్వేషులు, బెదిరింపు రాజకీయాలు చేసేవాళ్లు, నెపోటిజం మాఫియాకి జనం తగిన స్థానాన్ని కట్టబెట్టారు. నా ఇంటిని అక్రమంగా కూల్చి మహారాష్ట్రను వదిలిపొమ్మని బెదిరించారు. ఇప్పుడు వాళ్లనే జనం వదిలేశారు’ అని పేర్కొన్నారు. 2020లో ఉద్ధవ్ హయాంలో అధికారులు కంగనా ఇంటిని కూల్చారు.

News January 17, 2026

ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> ప్రాజెక్ట్ ఆఫీసర్, SAP స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.40వేలు, SAP స్పెషలిస్టుకు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in